News February 14, 2026

స్టే.ఘ: పదిలో ఒక్కడు!

image

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి ఈనెల 11న ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు పక్రియ ముగిసింది. కాగా, మున్సిపల్ కేంద్రంలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి వార్డు అభ్యర్థి తాటికొండ మధు విజయం సాధించి, పదిమందిలో ఒకడిగా నిలిచాడు.

Similar News

News February 15, 2026

టెన్త్ అర్హతతో 22,195 ఉద్యోగాలు

image

రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-33 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News February 15, 2026

BREAKING: భువనగిరిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

భువనగిరి స్వర్ణగిరి ఆలయం సమీపాన తెలంగాణ గురుకుల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన బాల ఆకాష్ అనే పదో తరగతి విద్యార్థి బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News February 15, 2026

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 16న అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించబడుతుందన్నారు. అర్జీదారులు అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.