News March 21, 2024
స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లు త్వరగా చేపట్టాలి: శ్రీకాకుళం కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని నమూన్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట పట్టణాల్లో సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News September 26, 2025
SKLM: ‘ఆధార్‌లో లోపాలుంటే సవరించుకోండి’

ఆధార్‌లో తప్పులను సవరించుకునేందుకు శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస పోస్టు ఆఫీసులో కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ సేవలు కల్పిస్తున్నామన్నారు. నూతన ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ డేట్ అఫ్ బర్త్ కరెక్షన్, ఐరిష్, బయోమెట్రిక్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
News September 26, 2025
CUTE PHOTO: భుజం ఎక్కిన ‘బాధ్యత’

కూతురి హృదయంలో నాన్న ఎప్పుడూ హీరోనే.. అలాగే తండ్రికి కూతురే లోకం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూతురిపై తండ్రి ప్రేమకు నిదర్శనమే పై ఫొటో. గురువారం కొత్తమ్మతల్లి పండగ విధుల్లో ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కూతురిని భుజాలపై ఎక్కించుకుని జాతరలో అందాలను చూపించారు. కలెక్టర్‌కు తన కూతురిపై ఉన్న ప్రేమను చూసిన పలువురు భక్తులు ముగ్ధులయ్యారు.
News September 26, 2025
శ్రీకాకుళం: రూ.15 వేల కోసం 10,728 దరఖాస్తులు

దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుశం జిల్లా వ్యాప్తంగా 10, 981 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 10,728 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 113 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అత్యధికంగా రణస్థలంలో 595, తక్కువగా ఎల్ఎన్ పేటలో 131 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కాగా ఈ నెల 22 తో గడువు ముగిసింది.