News December 28, 2025
స్త్రీధనాన్ని క్లెయిం చేసుకోవచ్చు

మహిళ తన భర్త నుంచి విడిపోయే క్రమంలో స్త్రీధనాన్ని క్లెయిం చేయొచ్చు. అయితే భార్య తల్లిదండ్రులు భర్తకు ఇచ్చిన బహుమతులు, భార్య పేరిట భర్త ఏదైనా చర, స్థిరాస్తి కొన్నా, వివాహిత తన నెలవారీ సంపాదనలో కొంత మొత్తాన్ని ఇంటి ఖర్చుల కోసం వాడినవి స్త్రీధనం పరిధిలోకి రావు. వాటిని క్లెయిం చేసుకోవడం కుదరదు. మహిళ తనకు స్త్రీ ధనంగా వచ్చిన విలువైన వస్తువులు, కానుకల జాబితాను రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 3, 2026
నేటి నుంచి TG TET

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నిర్వహించనున్నారు. మొత్తం 97 ఎగ్జామ్ సెంటర్లలో 9 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ తప్పనిసరి చేయడంతో వారు కూడా పరీక్ష రాయనున్నారు. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లున్నారు.
News January 3, 2026
భూ సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యం: చంద్రబాబు

AP: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుక అని CM చంద్రబాబు అన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చూడాలని, ఇదే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షించారు. పాసు పుస్తకాల పంపిణీలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు.
News January 3, 2026
ఏ పంటలకు చెదపురుగుల బెడద ఎక్కువ?

కలప సంబంధిత వృక్ష జాతులు, ధాన్యపు పంటలు, మామిడి, కొబ్బరి, కోకో, ద్రాక్ష, చెరకు తోటలను చెదపురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. పంట నారుమడి దశ నుంచి పూర్తిగా ఎదిగే వరకూ చెదపురుగుల ముప్పు ఎక్కువే. ఇవి నేలలో సొరంగాలు చేసుకొని, నేలపై పుట్టలు పెట్టి జీవిస్తాయి. ఇవి మొక్కల వేర్లను, భూమికి దగ్గరగా ఉండే కాండపు భాగాలను, పెద్ద వృక్షాల బెరడును తినడం వల్ల మొక్కలు, చెట్లు చనిపోయి నష్టం కలుగుతుంది.


