News March 26, 2025
స్త్రీ నిధి రుణాలు వసూలు చేయాలి: ASF అదనపు కలెక్టర్

జిల్లాలో స్త్రీ నిధి రుణాల వసూలుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సహాయ ప్రాజెక్టు మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి రుణాల వసూలు సమర్థవంతంగా నిర్వహించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో అందించిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 8, 2025
GNT: సరిగ్గా 9 ఏళ్ల క్రితం అందరి మైండ్ బ్లాక్..!

2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేయటం ఉమ్మడి గుంటూరు జిల్లాలను కుదిపేసింది. నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, రాజధాని రాక కారణంగా ప్రజల్లో పెరిగిన లావాదేవీలపై నోట్ల రద్దు పెను ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలో ఇతర జిల్లాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగితే ఇక్కడ కోట్లల్లో జరిగాయి. ఆ పరిణామం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేని. దీనిపై మీ COMMENT.
News November 8, 2025
‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 8, 2025
గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.


