News March 22, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
Similar News
News March 23, 2025
రాష్ట్రంలో 8 మంది మృతి

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్‌పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.
News March 23, 2025
కోనసీమ: రేపు యథావిధిగా మీకోసం వేదిక: కలెక్టర్

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అమలాపురం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News March 23, 2025
రోహిత్ డకౌట్

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఖలీల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ ఫీల్డర్ శివమ్ దూబేకు ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు.