News September 2, 2025
స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.
Similar News
News September 2, 2025
ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే రూ. లక్ష జమ..!

ఇందిరమ్మ ఇల్లు కట్టకుండానే ఖాతాలో రూ. లక్ష జమయిన ఘటన కామేపల్లి మండలం రేపల్లెవారి గ్రామం జాగన్నతండాలో జరిగింది. బాధితుడు తేజావత్ రవి వివరాలిలా.. ‘నాకు ఇల్లు మంజూరయిన విషయం అధికారులు చెప్పలేదు. కానీ నా ఖాతాలో రూ. లక్ష జమకాగా ఆరా తీయగా ఇల్లు మంజూరయిందని తెలిసింది. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి’ అని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
News September 2, 2025
సూర్యఘర్‌పై అవగాహన.. షెడ్యూల్ ఇలా!

సౌర విద్యుత్ ఉత్పత్తి, వాడకాన్ని ప్రోత్సహించేలా రూపొందించిన ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై మంగళవారం నుంచి నిర్వహించే అవగాహన సదస్సులకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మంగళవారం అన్నారుగూడెం, తల్లాడలో, బుధవారం తనికెళ్ల, కొణిజర్ల, గురువారం నేలకొండపల్లిలో, శుక్రవారం ముదిగొండ, వల్లభితో పాటు శనివారం కందుకూరులో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.
News September 2, 2025
వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.