News February 10, 2025

స్థానిక ఎన్నికలు.. గద్వాల జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీ‌లు,13 మండలాలు ఉన్నాయి. ఎర్రవల్లి కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-13, ఎంపీపీ-13 ఎంపీటీసీ-141, గ్రామ పంచాయతీలు 255 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

Similar News

News November 16, 2025

తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది…?

image

పూర్వం శ్రీశుకమహర్షి ఈ ప్రాంతంలో నివసించడం వల్ల శ్రీశుకనూరు అనే పేరు ఏర్పడింది. తమిళంలో తిరుచ్చుగనూరుగా పిలవబడుతూ తర్వాతి కాలంలో తిరుచానూరు వాడుకలోకి వచ్చింది. అలమేలు మంగాపురం, అలమేలుమంగపట్నం అని కూడా పిలుస్తారు.

News November 16, 2025

iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

image

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్‌లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్‌<<>>, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

News November 16, 2025

పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

image

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.