News February 7, 2025
స్థానిక ఎన్నికలు: భూపాలపల్లి జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన భూపాలపల్లి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2, ఒక రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-12, MPP-12, MPTC-106, గ్రామ పంచాయతీలు-242, వార్డులు 2044 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News October 19, 2025
బాహుబలి ది ఎపిక్.. ఎనిమిదేళ్ల కిందటి ట్వీట్ వైరల్

బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించేందుకు ‘బాహుబలి ది ఎపిక్’ సిద్ధమవుతోంది. 2 భాగాలు కలిపి ఒకే పార్టుగా ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందట బిజినెస్‌మ్యాన్ నారాయణరావు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘బాహుబలి పార్ట్ 1&2 కలిపి ఓ సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. మళ్లీ తక్కువలో తక్కువ రూ.500 కోట్లు రాబట్టవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
News October 19, 2025
ఇస్రో షార్ 141 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇస్రో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ 141 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://www.isro.gov.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 19, 2025
వెలుగులను నింపేది దీపావళి: జనగామ కలెక్టర్

చీకట్లను తొలగించి వెలుగును అందించే పండగ దీపావళి అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జిల్లా ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.