News February 7, 2025

స్థానిక ఎన్నికలు: మహబూబాబాద్ జిల్లా వివరాలు

image

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2, మున్సిపాలిటీ‌లు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-18, MPP-18, MPTC-193, గ్రామ పంచాయతీలు-497, వార్డులు 47,548 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.
* నోట్: ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంది.

Similar News

News July 6, 2025

బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

image

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

News July 6, 2025

KMR: UPSC సివిల్స్‌కు ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సివిల్స్‌కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని స్రవంతి తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08462-241055కు సంప్రదించాలని ఆమె కోరారు.