News January 30, 2025
స్థానిక ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధం: రవికుమార్

చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధమని అన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని.. కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి శ్యామ్ రావు, కర్ణాకర్ ఉదయ్ కుమార్, సామెల్ రాజ్ దేవయ్య ఉన్నారు.
Similar News
News January 1, 2026
మెదక్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.
News January 1, 2026
భారీ పొగమంచు.. వాహనదారులకు ఎస్పీ అలర్ట్

మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పొగమంచు సమయంలో వేగం తగ్గించి, హెడ్‌లైట్లు ఆన్ చేసి, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు. ద్విచక్ర, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.


