News December 18, 2025

స్థానిక పోరులో VKB.. 82.49% పోలింగ్

image

వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 70 గ్రామ పంచాయతీలు, 546 వార్డులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 524 పంచాయతీలకు, 4512 వార్డులకు ఎన్నికలు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా 82.49% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చేసిన కృషి సఫలం అయ్యింది.

Similar News

News December 21, 2025

ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

image

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.

News December 21, 2025

#SaveAravalli: పురాతన పర్వతాల కోసం నెటిజన్ల పోరాటం!

image

గుజరాత్, రాజస్థాన్, హరియాణాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ సోషల్ మీడియాలో #SaveAravalli క్యాంపెయిన్ ఊపందుకుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే ‘ఆరావళి’గా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల మైనింగ్, అక్రమ కట్టడాలు, ఎడారి ధూళి వల్ల ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రం కావడం, రాజస్థాన్‌లో వర్షాలు తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయని పర్యావరణవేత్తల ఆందోళన.

News December 21, 2025

అబద్ధాలు ఆపండి.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

image

స్వతంత్రానికి ముందు అస్సాంను పాక్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని PM మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ అబద్ధాలు ఆపాలని మండిపడింది. ‘అస్సాంను పాక్‌కు ఇచ్చే ప్రపోజలే అప్పట్లో లేదు. కాంగ్రెస్ కుట్ర చేసిందనడానికి ఆధారాలు లేవు. చరిత్రను ప్రచార నినాదంగా PM మార్చుకున్నారు. RSS శిక్షణ పొందిన వ్యక్తి అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు’ అని కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ ఫైరయ్యారు.