News October 9, 2025
స్థానిక పోరు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో గురువారం(నేడు) MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. మొదటి విడుతలో జిల్లాలోని 20 ZPTC స్థానాలకు గానూ 10, 283 MPTC స్థానాలకు గానూ 149 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది.
Similar News
News October 9, 2025
బాలల డాక్యుమెంట్‌లు 15 రోజుల్లో జారీ చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు 15 రోజుల్లోగా ఆధార్, కుల ధ్రువపత్రాలు సహా ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్‌లను జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కేసులపై చర్యలు వేగవంతం చేసి, అర్హులైన వారికి పరిహారం అందించాలని సూచించారు. పిల్లల భద్రతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
News October 9, 2025
ఖమ్మం: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News October 9, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ: అ.కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అ.కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. టీఎన్జీఓస్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి 3.69 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, గన్నీ సంచులు, లైటింగ్, నీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.