News June 21, 2024

స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్

image

నాగర్ కర్నూల్ జిల్లా మొలచింతలపల్లిలో చెంచు మహిళపై అత్యాచారం ఘటనలో బండి శివ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులు, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో క్రైం పెరిగిపోయిందన్నారు. గువ్వల బాలరాజు, తదితరులు ఉన్నారు.

Similar News

News October 7, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా విలియంకొండలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 34.5 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 33.1 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 31.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 7, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

News October 7, 2024

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

image

శ్రీశైలం జలాశయానికి ఆదివారం ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతుంది. జూరాల గేట్ల ద్వారా 21,603, విద్యుదుత్పత్తి చేస్తూ 37,252, సుంకేసుల నుంచి 26,874 మొత్తం 85,756 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వస్తుంది. దీంతో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, AP జెన్కో పరిధిలోని కుడి గట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ14,379 మొత్తం 49,694 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.