News March 26, 2024
స్థానిక సంస్థలపై హస్తం ఫోకస్

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. గత పదేళ్లుగా ఎంపీటీసీలు మొదలు జిల్లా స్థాయి చైర్మన్ల వరకు అన్ని భారాస ఖాతాలోనే ఉండటంతో.. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మూడింట రెండొంతుల పురపాలికల్లో హస్తం పార్టీ పాగా వేసింది. మిగిలిన వాటినీ లోక్ సభ ఎన్నికల్లోపే హస్తగతం చేసుకునేలా కసరత్తు చేస్తోంది
Similar News
News December 15, 2025
మూడో విడతకు నల్గొండ యంత్రాంగం సిద్ధం

గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు దేవరకొండ డివిజన్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 17న చందంపేట, దేవరకొండ సహా 9మండలాల్లోని 2,206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన సిబ్బంది 2,647 ప్రిసైడింగ్, 2,959 అసిస్టెంట్ ప్రిసైడింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో సోమవారం ఈ ప్రక్రియ జరిగింది..
News December 15, 2025
చిట్యాల: రిగ్గింగ్ జరిగందంటూ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు, పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తన గుర్తుపై ఓటేసిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడేసి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News December 15, 2025
నల్గొండ: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం..!

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు దేవరకొండ డివిజన్‌లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డివిజన్‌లోని మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 227 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల భవిత్యం తేలనుంది. మొత్తం 2,81,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


