News July 8, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కదు: Dy.CM

image

త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి డిపాజిట్ కూడా దక్కదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. మహబూబాబాద్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామన్నారు.

Similar News

News July 8, 2025

తూ.గో జిల్లాలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”

image

తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహాకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పేర్కొన్నారు.

News July 8, 2025

బాలకార్మికులను సంరక్షించిన విజయవాడ RPF పోలీసులు

image

విజయవాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)పోలీసులు ట్రైన్‌లో పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 9 మంది మైనర్ బాలురను మంగళవారం గుర్తించారు. ఈ మేరకు బాలలను పని కోసం తరలిస్తున్న నలుగురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని RPF పోలీసులు చెప్పారు. విజయవాడ స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో వీరిని గుర్తించామని, ప్రస్తుతం బాలలను సంక్షేమ కమిటీకి తరలించామని RPF సిబ్బంది తెలిపారు.

News July 8, 2025

DEECET అభ్యర్థులకు అలర్ట్

image

AP: డైట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన DEECETకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ఈనెల 13 నుంచి 16 వరకు సీట్ అలాట్‌మెంట్స్, 17 నుంచి 22 వరకు DIET కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటాయని పేర్కొంది. 25న తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.