News October 9, 2025

స్థానిక సమరం.. ఉమ్మడి పాలమూరు రెడీ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, గురువారం ఎంపీటీసీ/జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 39 జడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది.

Similar News

News October 9, 2025

MBNR: మొదటి విడత ఎన్నికలు.. ఈ మండలాలలోనే!

image

జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. గండీడ్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, భూత్‌పూర్, బాలానగర్ మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీనికోసం జిల్లాలో 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News October 9, 2025

MBNR: ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి విజయేందిర బోయి తెలిపారు. నేటి నుంచి తొలి విడత ZPTC, MPTC ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. HYD నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

News October 9, 2025

జడ్చర్లలో పాముకు చికిత్స

image

జడ్చర్ల పట్టణంలో కరెంట్ షాక్‌కు గురై గాయపడిన పాముకు చికిత్స అందించారు. పట్టణంలోని ఓ పరిశ్రమ పవర్ బోర్డులో చేరి పవర్ బోర్డులోకి చేరిన సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు గమనించిన పరిశ్రమ యజమాని సమాచారం ఇచ్చారు. ఆయన శిష్యులు శ్రీకాంత్, శివకుమార్ వచ్చి దాన్ని రక్షించారు. అనంతరం డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.