News October 6, 2025

స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించ గల సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, ఎంపీడీవోలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై అంశాల వారిగా అర్జీలపై మండలాలు వారిగా విశ్లేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. నేటి పీజీఆర్ఎస్‌లో 149 అర్జీలు స్వీకరించారు.

Similar News

News October 6, 2025

రాజమండ్రి: బస్సులు, రైళ్లు కిటకిట

image

దసరా సెలవులు ముగియడంతో బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు 175 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో వైవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

News October 6, 2025

రాజమండ్రి: ధర లేక కోకో రైతుల దిగాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో కోకోకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023లో కిలో రూ. 1,030 పలికిన ధర ఈ ఏడాది రూ. 450కి పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో రైతుల ఆందోళనల తర్వాత కలెక్టర్ సంప్రదింపులు చేసి రూ. 50 పెంచారు. ప్రస్తుతం ఆ పెంచిన ధరతో కూడా కొనే నాథులు లేక రైతులు అల్లాడుతున్నారు.

News October 6, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ కీర్తి

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈనెల 6న జిల్లాలో యథాతధంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. పాత అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకోవడానికి 1100కు ఫోన్ నంబర్‌కి చేయాలన్నారు.