News November 21, 2025

స్నిపర్ డాగ్ అర్జున్‌కు నివాళులర్పించిన ఎస్పీ

image

పోలీసు శాఖలో విశేష సేవలందించిన స్నిపర్ డాగ్ అర్జున్ శుక్రవారం మృతి చెందింది. ఈ డాగ్ అంత్యక్రియలను మొత్తం జిల్లా పోలీస్ యూనిట్ శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఎస్పీ బిందుమాధవ్ హాజరై నివాళులర్పించారు. వాస్తవానికి ఈ ఏడాది మే 17న రిటైర్ అయినప్పటికీ సేవలు అందిస్తోంది. కాగా పోలీసులు అర్జున్ మృతదేహం చూసి కన్నీరు పెట్టుకున్నారు.

Similar News

News November 22, 2025

వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

మార్గశిర మాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. దేవస్థానం పరిసరాలు భక్తి శ్రద్ధలతో సందడిగా మారాయి.

News November 22, 2025

కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

image

కంచరపాలెం రైతు బజార్‌కు 880 గ్రాములు క్యారేట్‌ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్‌ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్‌లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.

News November 22, 2025

BOIలో 115 SO పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/