News August 25, 2025
స్నేహమే సక్సెస్ కీ.. నలుగురికీ టీచర్ ఉద్యోగాలు

నలుగురూ ఫ్రెండ్స్. కర్నూలు బి క్యాంప్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఫలితాల్లో అందరూ ఉద్యోగాలు సాధించడంతో వారి ఆనంధానికి అవధుల్లేవు. గూడూరు గ్రామానికి చెందిన జి.వెంకటేశ్(85.9), అమడగుంట్ల గ్రామానికి చెందిన జి.ఉపేంద్ర(83.7), బెల్లల్ గ్రామానికి చెందిన ఎం.విజయ్ కుమార్(80.3), వై.సురేంద్ర(77.1) ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఈ విజయంపై తల్లిదండ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News August 25, 2025
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.
News August 25, 2025
HYD: గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్

గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్‌లో గతంలో కమర్షియల్ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.
News August 25, 2025
కృష్ణా జిల్లాలో 5,17,825 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

కృష్ణా జిల్లాలో కొత్త సాంకేతిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలోని 5,17,825 కుటుంబాలకు ఈ కార్డులను అందజేయనున్నారు. ఏటీఎమ్ కార్డు ఆకారంలో, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని స్వయంగా కార్డులు అందజేస్తారు.