News March 31, 2026
స్పానిష్‌లో ‘దృశ్యం’ రీమేక్

మలయాళ థ్రిల్లర్ మూవీ <<19460122>>‘దృశ్యం’ <<>>ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలతోపాటు శ్రీలంక, చైనాలోనూ రీమేక్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని స్పానిష్‌లో తెరకెక్కించనున్నట్లు నిర్మాత రోడ్రిగో ఎస్పినెల్ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెల్లడించారు. ‘ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. స్పానిష్ కల్చర్‌కు అనుగుణంగా మార్పులు చేస్తాం. జూన్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు.
Similar News
News April 13, 2026
భారత నౌకలకు టోల్ తీసుకోలేదు: ఇరాన్

హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పటి వరకు భారత నౌకల నుంచి టోల్ వసూలు చేయలేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్ తమ మిత్రదేశమని పునరుద్ఘాటించింది. భారతీయ నౌకల భద్రత, ప్రయాణ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఇండియాలోని ఆ దేశ రాయబారి ఫతాలీ తెలిపారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. హార్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న US హెచ్చరికలను కొట్టిపారేస్తూ.. ‘వారికి మా సామర్థ్యం ఏంటో తెలుసు’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
పాండ్య, డేవిడ్‌లకు ఫైన్

IPL: ముంబై కెప్టెన్ పాండ్య, ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు జరిమానా పడింది. నిన్నటి మ్యాచులో అంపైర్ సూచనలను <<19638355>>డేవిడ్<<>> పట్టించుకోలేదని, ఎన్నిసార్లు అడిగినా బాల్ ఇవ్వలేదని IPL యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినందుకు అతడి మ్యాచు ఫీజులో 25% కోత విధించినట్లు తెలిపింది. అటు స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసినట్లు వెల్లడించింది.
News April 13, 2026
12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA

AP: రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 44 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. మ.12 నుంచి సా.4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈరోజు కడపలో గరిష్ఠంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.


