News December 16, 2025

స్పిన్నర్‌కు భారీ ధర

image

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్‌(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్‌(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

Similar News

News December 18, 2025

కాల సర్ప దోషం ఎలా ఏర్పడుతుంది?

image

జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు (రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని) ఉంటే దానినే కాల సర్ప దోషం అంటారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రకాల కాల సర్ప దోషాలు ఉంటాయట. ప్రతి దానికీ వేర్వేరు ప్రభావాలు, నివారణలు ఉన్నాయంటున్నారు. రాహుకేతువులు లగ్నం 1, 2, 7, 8వ స్థానాల్లో ఉంటే దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీటికి నివారణ మార్గాలున్నాయని వివరిస్తున్నారు.

News December 18, 2025

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.

News December 18, 2025

కాల సర్ప దోష నివారణ మార్గాలు

image

రోజూ శివుడిని పూజించడం, సోమవారం శివలింగానికి పాలతో అభిషేకించడం వల్ల కాల సర్ప దోష ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ‘శనివారం శనీశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పించి 7 ప్రదక్షిణలు చేయాలి. నాగపంచమి రోజున గుడిలో నాగుల జంట ప్రతిమను దర్శించాలి. మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. నాగ ఉంగరాన్ని ధరించాలి. ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుంది’ అని సూచిస్తున్నారు.