News October 6, 2025

స్పిరిట్, లేబుల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?

image

ములకలచెరువుకు స్పిరిట్ సరఫరా ఎక్కడ నుంచి సరపరా అయిందనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏపీలో పట్టుబడ్డ రెండు, మూడు కేసుల్లో హైదరాబాద్ నుంచి ఓ డిస్లరీ కంపెనీ నుంచి సరఫరా అయినట్లు సమాచారం. అదే కంపెనీ నుంచి స్పిరిట్ సరఫరా చేశారా? లేక బెంగళూరు నుంచి వచ్చిందా అనే కోణంలో పోలీసుల విచారిస్తున్నట్లు సమాచారం. ఇక నకిలీ లేబుల్‌లు ఎక్కడ ముద్రించారనే ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి.

Similar News

News October 6, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంకండి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు-2025 సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. రీట‌ర్నింగ్ అధికారులు (ROs) స్టేజ్-II, సహాయ రీట‌ర్నింగ్ అధికారులు (AROs) స్టేజ్-I లకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ జరిగింది. ACLB రాజేశ్వర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.

News October 6, 2025

సిద్దిపేట: సీపీ అనురాధకు ఘనంగా వీడ్కోలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ బి.అనురాధ ఇటీవల LB నగర్ DCPగా బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా బదిలీపై వెళ్తున్న అనురాధను ఈరోజు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. గౌరవ వందనం చేసి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

News October 6, 2025

గజ్వేల్: కామన్ డైట్ మెనూ పాటించాలి: కలెక్టర్

image

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పప్పు, ఆలు గడ్డ, క్యారెట్ కలిపి కూర, సాంబార్, బాగరా అన్నం పెడుతున్నట్లు వంట సిబ్బంది తెలపగా కూర నాణ్యత మెరుగుపరచి రుచికరంగా వండాలని సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఆకుకూరలు ఎక్కువగా వాడాలని సూచించారు.