News February 25, 2025

స్పీకర్‌కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి 

image

స్పీకర్ అయ్యన్నపాత్రుడుని యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం కలిశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను పిలవట్లేదన్నారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ పర్యటనకు వచ్చినా తమకు ఎటువంటి ఆహ్వానం లేదన్నారు.

Similar News

News December 21, 2025

ఒంగోలు: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి.. పూర్తి వివరాలివే!

image

ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హర్ష (18) ఈతకు వెళ్లి మడనూరు వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. 9 మంది స్నేహితులతో కలిసి వెళ్లిన హర్ష మడనూరు తీరం వద్దకు చేరుకోగానే మొదటగా ఇద్దరితో కలిసి తీరంలోకి వెళ్లాడు. ఒకరు అలల ధాటికీ తట్టుకోలేక బయటకు రాగా.. హర్ష, రాధాకృష్ణమూర్తి ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకున్నారు. అయితే హర్ష మృతి చెందగా.. రాధాకృష్ణను వైద్యశాలకు తరలించారు.

News December 21, 2025

ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

image

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.

News December 21, 2025

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి

image

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడిగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో కనిగిరిలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టి జిల్లాలో TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.