News April 16, 2025

స్పీడ్ కంటే జీవితం అమూల్యం: అన్నమయ్య ఎస్పీ

image

స్పీడ్ కంటే జీవితం అమూల్యం అని, వాహనం నడిపే వారికి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాలలో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ డ్రైవింగ్, పరిమితికి మించి వేగం నేరమని వాహనదారులకు హెచ్చరిక చేశారు. జీవితంలో వేగంగా ఎదగండి, కానీ డ్రైవింగ్‌లో నిధానమే ప్రధానమన్నారు. థ్రిల్ కాదు.. సురక్షితంగా ఇంటికి చేరడమే ముఖ్యమని సూచించారు.

Similar News

News January 9, 2026

విశాఖ డైరీ రైతులకు పండగ బోనస్ పంపిణీ

image

విశాఖ డైరీ ద్వారా అందజేస్తున్న పండగ బోనస్ నగదును రైతులకు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం కొండల అగ్రహారం డైరీ వద్ద రైతులకు బోనస్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలు పోసే రైతులకు మూడు కోట్ల 90 లక్షలు పండగ బోనస్ చెక్కులను అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

News January 9, 2026

తిరుపతి: స్థానికాలయాల్లో 12లక్షల మంది దర్శనం

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా TTD స్థానికాలయాల్లో 12 లక్షల మంది దర్శనం చేసుకున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు పేర్కొన్నారు. కల్యాణ కట్టలో 2.6 లక్షల మంది తలనీలాలు సమర్పించారని అన్నారు. విజయవంతం చేసిన జిల్లా అధికారులు, జిల్లా పోలీసులు, TTD అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, భక్తులకు దన్యవాదాలు తెలిపారు.

News January 9, 2026

UP: 30ఏళ్లు పాక్ మహిళ ప్రభుత్వ ఉద్యోగం.. చివరికి

image

పాకిస్థానీ నేషనాలిటీని దాచేసి UPలో 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన మహిళ బండారం బయటపడింది. దీంతో ఆమెను అధికారులు సస్పెండ్ చేయగా, పోలీసులు FIR నమోదు చేశారు. మహీరా అక్తర్(ఫర్జానా) 1979లో పాకిస్థానీని పెళ్లాడి అక్కడి పౌరసత్వాన్నీ పొందింది. విడాకుల తర్వాత IND వచ్చి 1985లో ఓ లోకల్ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ జాబ్ సాధించింది. తాజాగా విద్యాశాఖ దర్యాప్తులో ఆమె ముసుగు తొలిగింది.