News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్‌తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్‌లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Similar News
News March 6, 2026
మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>> ధరలు ఇవాళ రెండోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ మొత్తం రూ.1,750 దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రా. బంగారం రూ.1,61,130గా ఉంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,600 తగ్గి రూ.1,47,700 పలుకుతోంది. కేజీ వెండి రేటు రూ.2.90 లక్షలుగా ఉంది.
News March 6, 2026
మరోసారి బొత్సకు అస్వస్థత

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.


