News December 20, 2025
స్పైస్‌జెట్ ప్యాసింజర్‌పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్‌జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.
Similar News
News December 25, 2025
ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

ఒడిశాలోని కందమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.
News December 25, 2025
GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.
News December 25, 2025
పిల్లలు త్వరగా పడుకోవాలంటే..

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు లేటుగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో చక్కగా నిద్రపట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు పిల్లలు ఫోన్, టీవీ చూడకుండా వారికి ఆసక్తి కలిగించే కథలు చెప్పాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చే సమయానికి గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.


