News March 26, 2026

స్పోర్ట్స్ స్కూల్లో ఎంపికలు: ఓలేటి జ్యోతి

image

స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం 2026- 27 సం.రానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. నాలుగో తరగతి బాల బాలికలు జిల్లా పరిధిలోని 18 మండలాల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 31న ఎంపికలు జరుగుతాయని సూచించారు.

Similar News

News April 9, 2026

చందనోత్సవం.. ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు’

image

సింహాచలంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్త్‌ కిషోర్ గురువారం పరిశీలించారు. చందనోత్సవ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఈవో వెంకట్రావు జరుగుతున్న పనులు, చేపడుతున్న భద్రతా చర్యలను కలెక్టర్‌కు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News April 9, 2026

NRML: వేయి ఉరుల మర్రి సాక్షిగా…!

image

ఆకాశమంత ధైర్యం.. అడవి పులి గర్జన.. వెరసి రాంజీగోండ్ తిరుగుబాటు! 1860 ఏప్రిల్ 9 నిర్మల్ చరిత్రలో ఒక మాయని మచ్చ. బ్రిటిష్ నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిన ‘వేయి ఉరుల మర్రి’ ఉదంతం వింటే నేటికీ ఒళ్లు గగుర్పుపొడుస్తుంది. అడవి బిడ్డల హక్కుల కోసం ఆంగ్లేయులను గడగడలాడించిన రాంజీ గోండ్‌ను, ఆయన వెయ్యి మంది అనుచరులను ఒకే మర్రి చెట్టుకు ఉరితీసిన పాశవిక ఘటన అది. ఆ వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా వాయువులు.

News April 9, 2026

తిరుపతి రుయాలో వాళ్లు లేకపోవడంతో..!

image

తిరుపతి రుయాలో రోజూ 1000కు పైగా OPలు ఉంటాయి. MBBS పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ఇక్కడ ఇంటర్న్‌షిప్‌గా సేవలందిస్తారు. గతేడాది బ్యాచ్ సేవలు ముగియడంతో ఫిబ్రవరి నెలాఖరున వెళ్లిపోయారు. ఇదే రోజు ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు రావాలి. సిలబస్ మారడంతో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. వీరి రాక ఆలస్యం కావడంతో సేవలు సకాలంలో అందడం లేదని రోగులు చెబుతున్నారు.