News August 14, 2025
స్పోర్ట్స్ హాబ్‌గా విజయనగరం: శాప్ ఛైర్మన్

విజయనగరం పట్టణంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు బుధవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి పట్టణంలో ఉన్న అన్ని క్రీడా మైదానాలను సందర్శించారు. విజయనగరాన్ని స్పోర్ట్స్ హాబ్‌గా తీర్చిదిద్దుతామని, అన్ని మైదానాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. విజ్జీ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, హాకీ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News September 26, 2025
VZM: ‘GST తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జరిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.
News September 26, 2025
పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో 3 షిప్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News September 26, 2025
VZM: ‘పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలి’

పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.