News September 11, 2025

“స్ఫూర్తి పథం” కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి 213 ప్రభుత్వ హైస్కూళ్లలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కల్పించనున్నారు.

Similar News

News September 11, 2025

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బదిలీ

image

సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కీర్తి చేకూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి చేకూరి స్వస్థలం వైజాగ్, ఆమె ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ చేశారు. గతంలో గుంటూరు నగర కమిషనర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా పనిచేశారు.

News September 11, 2025

మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

image

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.

News September 11, 2025

రాజమండ్రి: ఈ నెల 12న ఉద్యోగ మేళా

image

తూ.గో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణం వద్ద ఈనెల 12న జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి 19 నుంచి 30 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.