News January 28, 2026
స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించాలి: మంత్రి గొట్టిపాటి

విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించి రైతులు వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి దంపతులతో కలిసి జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌డీఎస్ఎస్ పనులలో మార్చినాటికి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.
Similar News
News February 4, 2026
నెల్లూరు: సాగులో దూసుకెళ్తున్న డ్రోన్లు.!

సాగులో డ్రోన్ల హవా పెరుగుతోంది. ఖర్చులు పెరగడం, రైతుకు పెనుభారమైన సమయంలో RKVY ద్వారా సబ్సిడీపై 5 మంది గ్రూప్ సభ్యులకు డ్రోన్లు మంజూరు చేస్తున్నారు. దీని ద్వారా పురుగు మందులు, ఎరువులను తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారి చేయవచ్చు. ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్‌తో రైతులు డ్రోన్ బుక్ చేసుకొనే అవకాశాన్ని RTGS అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
News February 4, 2026
నెల్లూరు: భూసార పరీక్షలకు పరుగో పరుగో

జిల్లాలో వ్యవసాయ శాఖ అయోమయంలో పడింది. ఓ వైపు జిల్లా అంతటా సాగు నెలకొనగా ప్రభుత్వం మరోసారి భూసార పరీక్షలు చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖ పరుగు పెడుతోంది. గతంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని వైనంపై Way2Newsలో ‘సాగు మొదలైన భూసార నివేదికలు’ ఎక్కడ శీర్షికన కథనం రాసింది. దీంతో రానున్న 7 వారాల్లో 30 వేల నమూనాలను సేకరించాలని కమిషనరేట్ ఆదేశించింది. సాగు జరుగుతుంటే ఎక్కడ నమూనాలు తీయాలనేది ప్రశ్న.
News February 4, 2026
చకచకా దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణం.!

జిల్లాకే తలమానికంగా మారనున్న దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. వాకాడు(M) పరిధిలోని 4 గ్రామాలు, కోట(M)లోని 2 గ్రామాల పరిధిలో 217.70 ఎకరాల్లో పోర్ట్ నిర్మాణం జరగనుంది. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.544.30 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఏడాది 5 లక్షల టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో షిప్ యార్డ్, నౌకా నిర్మాణం, వాటి మరమ్మతుల వ్యవస్థ అందుబాటులోకి రానుంది.


