News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2026
పత్తి కొనుగోళ్లకు నెలాఖరు వరకు అవకాశం

TG: రాష్ట్రంలోని పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సీసీఐ తెలిపింది. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈక్రమంలోనే కేంద్ర జౌళిశాఖకు అధికారులు లేఖ కూడా రాశారు. దీంతో గడువు పొడిగిస్తున్నట్లు సీసీఐ తెలిపింది.
News February 21, 2026
ఉగ్రదాడులకు చంచల్‌గూడ జైల్లో పథక రచన

TG: దేశంలో ఉగ్రకుట్ర <<19199047>>వ్యవహారంలో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ పేలుళ్లకు పాల్పడాలని చంచల్‌గూడ జైలులో లష్కరే తోయిబా ఉగ్రవాది పథకం రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ములాఖత్‌లో భాగంగా తనను కలవడానికి వచ్చిన వారితో జైల్లోనే ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో నగరంలోని ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
News February 21, 2026
T20 WC: భారత్‌కు షాక్!

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో మ్యాచుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నెట్స్‌లో పేస్ బౌలర్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు తెలిపాయి. సిరాజ్ గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్‌లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI షేర్ చేసింది.


