News February 1, 2026

స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరించనున్నారని వీటి ఆపరేటర్ల ఎంపికకు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డీపీఓ వసుమతి తెలిపారు. అల్లూరు, అనంత సాగరం, ఏఎస్పేట, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి, వాకాడు, ఓజిలి, విడవలూరు, సీతారామపురం, కలువాయి, దగదర్తి, దుత్తలూరు పలు మండలాల్లో స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు.

Similar News

News February 12, 2026

నెల్లూరు: సముద్రపు బిడ్డల వింత ఆచారం..!

image

నెల్లూరు జిల్లాలో సుమారు 169 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఈ మత్స్యకారులైన ‘పట్టపు’ సామాజిక వర్గం తమ విలక్షణమైన ఆచారాలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. వీరి భాషలో తెలుగు, తమిళం కలగలిసిన యాస వినడానికి ఎంతో వింతగా ఉంటుంది. సముద్రాన్ని దైవంగా భావించే వీరు, వేటకు వెళ్లేముందు చేసే గంగమ్మ పూజలు అపురూపంగా ఉంటాయి. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల కట్టుబాట్లను గౌరవిస్తూ, ఐకమత్యంగా జీవించడం వీరి గొప్పతనం.

News February 12, 2026

నెల్లూరు: ఆ రెండూ పార్టీలు ఎక్కడ..?

image

TDP, జనసేన, BJP కలిసి కూటమిగా ఏర్పడినా ఆ రెండు పార్టీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా మారుతోంది. కూటమిలో జనసేన, BJPలతో టీడీపీ సఖ్యతతో నడవడం లేదంట. జనసేనలో నాయకత్వ పగ్గాలు మోసే వారు కరవయ్యారు. యాక్టీవ్‌గా ఉన్న నేతలు ఇప్పటికే సైడ్ అయిపోయారు. తమకు కూటమితో సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పాత పద్ధతిలోనే పోరాడుతోంది. జిల్లాలో 3 పార్టీలదీ తలో దారి అన్నట్టుగా మారింది.

News February 12, 2026

పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

image

పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.