News January 13, 2026
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.
Similar News
News February 2, 2026
నల్లపాడు పీఎస్‌లో నన్ను వేధించారు: అంబటి

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబును పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను నల్లపాడు పీఎస్‌లో టార్చర్ చేశారని అంబటి న్యాయమూర్తికి తెలిపారు. అధికారుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ చెప్పారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు.
News February 2, 2026
ప్లే ఆఫ్స్‌లోకి ఢిల్లీ మహిళల జట్టు

WPL-2026 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 122/8 పరుగులకే పరిమితం కాగా, ఢిల్లీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఢిల్లీ ఎల్లుండి గుజరాత్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
News February 2, 2026
రికార్డులు చూసుకోండి పాక్..

భారత్‌తో మ్యాచ్‌ను <<19024958>>బహిష్కరిస్తున్నట్లు<<>> ప్రకటించిన పాక్ జట్టుపై ఇండియన్స్ సెటైర్లు వేస్తున్నారు. WCలలో INDపై పాక్ రికార్డు చెత్తగా ఉందని గుర్తు చేస్తున్నారు. ODI WCలలో ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ అన్నీ ఇండియానే గెలిచింది. T20ల్లో ఆడిన 8 పోరుల్లో 6 సార్లు ఇండియాదే విజయం. పాక్ ఒక మ్యాచే గెలవగా మరొకటి డ్రా అయ్యింది. మైదానంలో గెలవడం చేతకాకే పరువు కాపాడుకోవడానికి ఈ డ్రామాలు చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.


