News February 15, 2025
స్వచ్ఛ్ ఆంధ్రలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యసాధనలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేకంగా ఓ థీమ్ తీసుకొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి వాటిలో 105 పాయింట్లతో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.
Similar News
News March 6, 2026
ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.
News March 6, 2026
ముస్లిం దేశాల్లో పాక్ దగ్గరే న్యూక్లియర్ వెపన్.. ఎలా?(1/2)

ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో పాక్ వణికిపోయింది. ‘గడ్డి తినైనా సరే అణుబాంబు సాధిస్తాం’ అని అప్పటి PM భుట్టో శపథం చేశారు. సైంటిస్ట్ AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి డిజైన్లు దొంగిలించి గ్లోబల్ బ్లాక్ మార్కెట్ సాయంతో ప్రాజెక్ట్-706 స్టార్ట్ చేశారు. పాక్ చేస్తున్నది తప్పని తెలిసినా రష్యాతో పోరాడేందుకు సాయపడుతుందని US సైలెంట్‌గా ఉండిపోయింది. చైనా సాయపడటంతో 1980ల నాటికే పాక్ లక్ష్యం చేరుకుంది.
News March 6, 2026
పాక్ ప్లాన్స్‌కు ఇజ్రాయెల్ చెక్.. భారత్ నో!(2/2)

ఇస్లాం దేశాల వద్ద న్యూక్లియర్ బాంబ్ ఉండడం రిస్క్ అని ఇజ్రాయెల్ ఫస్ట్ నుంచీ భావించింది. అందుకే పాక్ న్యూక్లియర్ ప్లాన్స్‌ను అడ్డుకునేందుకు కహుటా అణు కేంద్రాన్ని లేపేద్దామని అనుకుంది. అందుకోసం భారత ఎయిర్‌స్పేస్‌ను వాడుకుంటామని కోరింది. ముందు అంగీకరించిన ఇండియా.. పాక్‌తో అమెరికా క్లోజ్‌నెస్, JKలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనతో తర్వాత నో చెప్పింది.


