News September 13, 2024
స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం.. చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్

స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసి కడపను రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలు, పంచాయతీలతో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 19, 2026
పెండ్లిమర్రి: భర్తను గొడ్డలితో చంపిన భార్య

పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో దారుణ హత్య చోటుచేసుకుంది. భార్య సుహాసిని గొడ్డలితో భర్త సిద్ధారెడ్డిని హతమార్చింది. భార్యపై అనుమానంతో సిద్ధారెడ్డి రోజూ మద్యం తాగి వేధింపులకు పాల్పడుతుండేవాడని సమాచారం. ఈ వేధింపులు తాళలేక ఆమె దాడి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2026
బీఈడీ కళాశాలల యాజమాన్యాలపై VCకి ఫిర్యాదు

YVU పరిధిలోని కొన్ని బీఈడీ కళాశాలలు తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించాయని, ఇది సమంజసం కాదని ఆల్ ఇండియా బంజారా విద్యార్థి సంస్థ జిల్లా అధ్యక్షుడు రమావత్ జగన్నాయక్ అన్నారు. గురువారం YVUలోని పరిపాలన భవనంలో VC రాజశేఖర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నాయని ఆరోపించారు. తక్షణమే ఆయా కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
News February 19, 2026
ఎవరెస్ట్.. కడప జిల్లా నుంచి ఈ విద్యార్థి మాత్రమే.!

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు లద్దాక్‌లో నిర్వహించనున్న 12 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి బద్వేలు govt భవిత ట్రైనింగ్ సెంటర్ విద్యార్థి వెంకీ ఎంపికైనట్లు MPDO మల్లేశ్వరి తెలిపారు. జిల్లా నుంచి ఏకైక విద్యార్థిగా వెంకీ ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎవరెస్టు అధిరోహణపై ఆసక్తి గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ద్వారా ఎంపిక చేస్తోందని ఆమె తెలిపారు.


