News September 6, 2025

స్వచ్ఛ సర్వేక్షణలో పారదర్శకంగా ఎంపికలు: కలెక్టర్

image

పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల కోసం ఎంపికలను పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, బస్టాండ్లు, పాఠశాలలు, రైతు బజార్లను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయాలని సూచించారు.

Similar News

News September 6, 2025

గంగ ఒడికి బాలాపూర్‌ గణేశుడు

image

బాలాపూర్‌ గణేశుడు గంగ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, MJ మార్కెట్ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకొంది. సాయంత్రం 6:15 నిమిషాలకు క్రేన్‌ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సాగర్‌లో బాలాపూర్‌ గణేశుడిని నిమజ్జనం సంపూర్ణమైంది.

News September 6, 2025

జగిత్యాల: తల్లిని కొడుకు వద్దకు చేర్చిన అధికారులు

image

జగిత్యాల(R) మండలం ధరూర్ గ్రామానికి చెందిన ఆనెగండ్ల కిష్టమ్మ అనే వృద్ధురాలిని శనివారం జిల్లా అధికారులు ఆమె కొడుకు వద్దకు చేర్చారు. కిష్టమ్మను కొడుకు వేధించగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి జగిత్యాలలో యాచిస్తూ రోడ్లపై తిరుగుతుండగా సమాజ సేవకులు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం అందించారు. దీంతో కిష్టమ్మ కొడుకు, కోడలు పిలిపించి జగిత్యాల ఆర్డీవో ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి చేర్చారు.

News September 6, 2025

GST ఎఫెక్ట్.. ఫార్చునర్‌పై రూ.3.49 లక్షల తగ్గింపు

image

జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్‌పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్‌పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్‌పై రూ.2.52లక్షల వరకు, వెల్‌ఫైర్‌పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.