News March 16, 2025
స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధిలోని షీ టాయిలెట్స్‌తో పాటు పబ్లిక్ టాయిలెట్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి పనితీరును ఎంహెచ్ఓ అడిగి తెలుసుకున్నారు. నగరానికి మారు ఓడిఎఫ్ ++ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ ఉండాలన్నారు. మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించాలని తెలిపారు.
Similar News
News March 17, 2025
సంగారెడ్డి: జిల్లాకు చేరుకున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు

జిల్లాలో ఈ నెల 21 నుంచి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలను రూట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News March 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బయల్దేరుతుందని వెల్లడించారు.