News March 26, 2024

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మాజీ మంత్రి గుండ అప్ప‌ల..?

image

స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే విష‌య‌మై పునరాలోచ‌న చేస్తున్నామ‌ని మాజీమంత్రి గుండ అప్ప‌ల సూర్యనారాయ‌ణ తెలిపారు. ఈ మేర‌కు మంగళవారం ఆయన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌ చేశారు. సోమవారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్య‌క్షులు కూన ర‌వికుమార్ త‌మతో భేటీ అయ్యార‌ని, పార్టీ పునఃప‌రిశీల‌న అనంత‌రం నిర్ణ‌యం వెలువ‌డే దాకా వేచి ఉండాల‌ని సూచించార‌న్నారు. ఆ మేర‌కు తాము ఆలోచ‌న చేస్తున్నామన్నారు.

Similar News

News September 8, 2025

SKLM: కుల బహిష్కరణ చేశారంటూ వ్యక్తి ఆవేదన

image

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. మెళియాపుట్టి(M) జాడుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అనంతరం గ్రామంలో జీవనం సాగిస్తుండగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్థానికులు ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు.

News September 8, 2025

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

image

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీ‌హెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.

News September 8, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు