News December 27, 2025

స్వయంకృషి: మెటల్ ఇన్వెస్ట్‌మెంట్

image

సింపుల్‌గా చెప్పాలంటే బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడి. ఇవేకాక కాపర్, అల్యూమినియం, ఐరన్ ఇలా చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవి అంతర్జాతీయంగా నిరంతరం వినియోగంలో ఉంటాయి. ధరలు పెరుగుతాయి, లేదా కొంత కరెక్షన్ ఉంటుంది తప్ప పడిపోవు. కొంతకాలం మెటల్ మార్కెట్‌ను పరిశీలిస్తే మీకు అవగాహన వస్తుంది. నెల క్రితం కేజీ వెండి ఇవాళ్టి కంటే రూ.1లక్ష తక్కువ. నెలలో ఎంత లాభమో చూశారుగా.
రోజూ ఒంటిగంటకి ఓ బిజినెస్ ఐడియా

Similar News

News January 2, 2026

కూటమి దౌర్జన్యాలను తిప్పికొడదాం: YS జగన్

image

AP: పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు దాడులు చేస్తున్నారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వీటిని బలంగా తిప్పికొడదామని నేతలకు పిలుపునిచ్చారు. తప్పులు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం(D) యల్లనూరులో పార్టీ ZPTC సభ్యుడు విజయప్రతాప్‌పై హత్యాయత్నాన్ని జగన్ ఖండించారు. ఆయన తండ్రి నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

News January 2, 2026

టీవీ రేటింగ్స్.. రికార్డు సృష్టించిన బిగ్‌బాస్-9

image

టీవీ రేటింగ్‌‍లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే రికార్డు సృష్టించినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. ‘స్టార్ మాలో 19.6 TVR, జియో హాట్‌స్టార్‌లో 285M స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. గత 5 సీజన్స్‌‌లో ఇదే అత్యధికం. ఈ సీజన్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్‌ఫ్లిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రేక్షకుల అసాధారణ మద్దతు నిజంగా హిస్టారిక్’ అని ట్వీట్ చేశారు.

News January 2, 2026

ఉపాధి హామీకి కేంద్రం తూట్లు పొడుస్తోంది: భట్టి

image

TG: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు ఉంటే తప్పా? అని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఉపాధి హామీకి BJP తూట్లు పొడుస్తోంది. ఏ వ్యక్తి ఎక్కడైనా పనిచేసే వీలుంటే.. దానిని నిర్దేశిత ఏరియాకి పరిమితం చేసింది. అన్‌స్కిల్డ్ లేబర్‌ను దోచుకోకూడదని మేము చట్టం చేస్తే.. నో వర్క్ ఇన్ పీక్ సీజన్ అనడం దోపిడీ కాదా? రైట్ టు వర్క్.. పర్మిట్ టు వర్క్‌గా మార్చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.