News December 30, 2025

స్వయంకృషి: హాబీ- ఎర్నింగ్

image

మన అవసరం, అర్హతలతో ఉద్యోగం చేస్తూ హాబీలనూ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. కుట్లు-అల్లికలు, వంటలు, బేకింగ్, రచనలు, ట్రావెల్, రీసెర్చ్.. ఇలా హాబీ ఏదైనా మీరు మీ లీజర్ టైమ్ ఎంజాయ్ చేస్తూ దాంతో కూడా మనీ మేకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ కామర్స్ సంస్థలు, సోషల్ ప్లాట్‌ఫామ్స్, ఆఫ్‌లైన్లో అయితే పరిచయాలతో మన అభిరుచుల గురించి చెప్పి ఎదుటి వారికి చూపించి క్రమంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు.
రోజూ 1Pmకు ఓ బిజినెస్ ఐడియా

Similar News

News February 15, 2026

శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

image

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.

News February 15, 2026

రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.

News February 15, 2026

చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

image

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.