News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News August 23, 2025

చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో జరిగిన హస్తకళా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హస్తకళలను ప్రోత్సహించడం మన సంస్కృతికి, కళాకారుల అభివృద్ధికి అవసరమని తెలిపారు. ఇటువంటి ప్రదర్శనలను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

News August 23, 2025

వినాయక ఉత్సవ కమిటీలకు కలెక్టర్ విజ్ఞప్తి

image

రాజమండ్రిలో వినాయక చవితి ఉత్సవాల అనుమతుల మంజూరు కోసం సింగిల్ విండో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి తెలిపారు. ఉత్సవ కమిటీలు సులభంగా అనుమతులు పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ప్రక్రియలో నగరపాలక సంస్థకు సహకరించాలని ఆమె ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.

News August 23, 2025

రాజమండ్రి: కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యం

image

మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఈ పాలసీలో భాగంగా బార్లలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, స్టేషన్ సీఐలతో ఆయన సమావేశం నిర్వహించారు.