News January 8, 2026
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో బాపట్ల ముందుండాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి కీలక ప్రగతి సూచికల్లో (KPIs) మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
Similar News
News February 8, 2026
సిరాజ్ మియా.. హాలిడే ప్లాన్ నుంచి WCలోకి సడన్ ఎంట్రీ

సిరాజ్ అసలు ప్లాన్ జర్మనీకి హాలిడే ట్రిప్, స్పెయిన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్. కానీ హర్షిత్ గాయంతో T20 WCలో ఆడే అవకాశం వచ్చింది. దీనికి తోడు బుమ్రా అస్వస్థత వల్ల నేరుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ పవర్‌ప్లేలోనే వికెట్లు తీసి USను దెబ్బకొట్టారు. 3/29తో అదరగొట్టడంతో భారత్ విజయం సాధించింది. ‘దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేరు’ అంటున్నారు ఈ హైదరాబాదీ మియా!
News February 8, 2026
ఏయూలో లైంగింక వేధింపుల కలకలం..

ఏయూ సంస్కృత విభాగంలోని సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి తమను లైంగికంగా వేధిస్తున్నారని పలువురు విద్యార్థినులు VCకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బయటకు రావడంతో వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తరగతి గదిలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగతంగా గదికి రమ్మని ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహా ఆరోపణలు గతంలోనూ ఉన్నాయని, ఒక కేసు కూడా నమోదైందని సమాచారం.
News February 8, 2026
పాలమూరు: కృష్ణగౌడ్ హత్యపై వీడని మిస్టరీ..!

గద్వాల్ (D) ఉండవెల్లి(M) కంచుపాడు శివారులో కృష్ణగౌడ్ హత్య జరిగి రెండు వారాలు గడిచినా నిందితుల ఆచూకీ లభించలేదు. జనవరి 25న దుండగులు కంట్లో కారం చల్లి దారుణంగా హత్య చేయగా, పోలీసులు ఇప్పటివరకు 30 మందిని విచారించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. పాత కక్షల లేక సుపారీ గ్యాంగ్ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని CI ప్రదీప్ కుమార్ చెప్పారు.


