News November 26, 2025

స్వర్ణాంధ్ర @ 2047 దిశగా పురోగతి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో (KPIs) పురోగతి కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన 563 కీలక ప్రగతి సూచికల్లో మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.

Similar News

News November 27, 2025

‘నగదు సీజ్ చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలి’

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా తనిఖీలు చేపట్టే సమయంలో సీజ్ చేసే నగదు, బంగారం, ఇతర వస్తువులకు సంబంధించి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో వీడియో రికార్డ్ చేయాలని, రూ.50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే వీడియో తీసి పంచనామా చేసి రశీదు ఇవ్వాలన్నారు.

News November 27, 2025

సిరిసిల్ల: హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ సెంటర్, మీడియా సెల్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. 24 గంటలు పనిచేసే ఈ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.

News November 27, 2025

సిద్దిపేట: సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ప్రచారం

image

సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఆశావహులు సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సొంత వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని గ్రామ ఓటర్లందరిని చేర్చుకుని పోస్ట్‌లతో హడావిడి చేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి గ్రామ యువ ఓటర్లను చేర్చుకొని పోస్ట్‌లతో హంగామా చేస్తున్నారు. యూ ట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ యువ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.