News March 4, 2026
స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో మార్చి 5న ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ కృతిక శుక్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామ సభలో కనీసం 200 మంది పాల్గొనేలా చూడాలన్నారు.
Similar News
News March 9, 2026
VKB: అక్రమంగా కలప రవాణా.. పట్టించుకోని అధికారులు

ఎక్కడపడితే అక్కడ పొలాల వెంట అడవులలో చెట్లను అక్రమాలు అందరికీ రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్, మోమిన్‌పేట్ మండలాల్లో అక్రమంగా చెట్లను నరికి రవాణా చేసి కాసుల పంట పండించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కలప రవాణాను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.
News March 9, 2026
MBNR: ఈనెల 11 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 1వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 9, 2026
అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.


