News January 7, 2026
స్వర్ణ నారావారి పల్లెలో సీఎం ప్రారంభించనున్న కార్యక్రమాలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని CM చంద్రబాబు స్వర్ణ నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, స్కిల్ డెవలప్మెంట్ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (50 బెడ్స్) ఈ సంజీవిని ప్రాజెక్టు, టాటా DINC, శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి CC రోడ్డు, 33/11 KV ఇండోర్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారు. మహిళలకు ఈ ఆటోల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Similar News
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
News January 8, 2026
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్

TG: హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. ‘ఉపాధి’కి గాంధీ పేరు తొలగింపుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై చర్చించనున్నారు. ఇతర అంశాలూ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News January 8, 2026
విశాఖ: ‘తార’ల క్రికెట్ సందడి.. ఆ 3 రోజులు పండగే!

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్‌లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.


