News November 17, 2025
స్వర్ణ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్
News November 17, 2025
కొమ్మమూరులో డెడ్ బాడీ కలకలం

కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం సమీపంలోని కొమ్మమురు కాలువ వంతెన వద్ద సోమవారం డెడ్ బాడీ కలకలం రేపింది. మృతురాలికి 50 ఏళ్లు ఉంటాయని, ఆమె ఎత్తు 4.5 అడుగులు, ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కారంచేడు ఎస్‌హెచ్‌ఓను సంప్రదించాలన్నారు.