News February 4, 2025

స్వల్పంగా తగ్గిన ఆయిల్ ఫాం గెలల ధర

image

ఆయిల్ ఫాం గెలల ధర జనవరి నెలకు స్వల్పంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్‌లో టన్ను ధర రూ.20,506 ఉంది. జనవరికి రూ.20,487కు తగ్గింది. జనవరిలో ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు.

Similar News

News July 7, 2025

‘అనకాపల్లి జిల్లాలో 1.33 లక్షల మంది లబ్ధిదారులు’

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 1.33 లక్షల మంది రైతులు అర్హత సాధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు ఆదివారం తెలిపారు. వెబ్ ల్యాండ్‌లో వివరాలు సరిగా నమోదు కాని రైతులు 23 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా ఈనెల 10వ తేదీలోగా సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News July 7, 2025

విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

image

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్‌కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.

News July 7, 2025

సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

image

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.