News November 1, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News February 20, 2026
గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది పెరుగుకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇందులో నీరు, లాక్టోస్ లేకుండా ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ షుగర్ ఉంటాయి. దీంట్లోని ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్, ఎముకల ఆరోగ్యం బావుంటుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట యోగర్ట్ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.
News February 20, 2026
ఇరాన్-US యుద్ధం వస్తే భారత్‌పై ప్రభావమెంత?

ఇరాన్‌పై యుద్ధం జరిగితే భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఆయిల్ ధరలను అమాంతం పెంచేస్తాయి. చమురు ధరలు 10% పెరిగితే మన దేశ GDP 0.3% తగ్గి, ద్రవ్యోల్బణం 0.4% పెరుగుతుంది. షిప్పింగ్ ఛార్జీలు 50% వరకు పెరుగుతాయి. ఫలితంగా రూపాయి విలువ పడిపోయి బంగారం ధరలకు రెక్కలొస్తాయి.
News February 20, 2026
‘చేతకాకుంటే చెప్పండి’.. పోలీసుల తీరుపై సుప్రీం ఫైర్

AP: MLC అనంతబాబు డ్రైవర్ హత్యకేసులో పోలీసుల తీరుపై SC ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి చేతకాకుంటే CBIకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ సాగదీస్తున్నారని మండిపడింది. అభియోగాలపై ఏప్రిల్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నవంబర్ 30లోపు ట్రయల్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అనంతబాబు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.


