News November 30, 2025
స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. HYDలో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹230-250గా ఉంది. చిత్తూరు, అమలాపురం, కడపలో ₹220-250, విజయవాడలో ₹230-240 వరకు పలుకుతోంది. మటన్ కేజీ ₹750-900 మధ్య ఉంది. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-8కి అమ్ముతున్నారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో మాంసానికి డిమాండ్ నెలకొంది. దీంతో రేట్లు మరింత పెరిగే ఛాన్సుంది. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
Similar News
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


