News January 21, 2026

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మళ్లీ పడతాయా?

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 25,185 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 82,025 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో ICICI బ్యాంక్, BE, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. నిన్న ₹9 లక్షల కోట్లకు పైగా మార్కెట్లు <<18907026>>నష్టపోవడం<<>> తెలిసిందే.

Similar News

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.

News April 10, 2026

మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

image

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

News April 10, 2026

భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవంటే?

image

భారతీయులకు అమెరికన్లలా సహజంగా పింక్ లిప్స్ ఉండకపోవడానికి ప్రధాన కారణం ‘మెలనిన్’అని మాజీ AIIMS డెర్మటాలజిస్ట్ ఆంచల్ పంత్ వివరించారు. ‘మన చర్మం సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పెదవులు గోధుమ, నలుపు రంగులో కనిపిస్తాయి. విదేశీయుల్లో మెలనిన్ తక్కువగా ఉండి రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. అందుకే పెదవులు పింక్ కలర్‌లో ఉంటాయి. ఇది జన్యుపరమైన మార్పే’ అని తెలిపారు.